Summer Season:  వేడికి తట్టుకోలేకపోతున్నారా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

Summer Season:  వేడికి తట్టుకోలేకపోతున్నారా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

నీడపట్టున.. ఆరోగ్యంగా వేసవికి అనుగుణంగా తేలికగా జీర్ణమయ్యే ఫుడ్ తినాలి. అప్పుడే సీజనల్ డిసీజ్ ల నుంచి తప్పించుకోవచ్చు.. సమ్మర్​ సీజన్​ లో పాటించాల్సిన చిట్కాల గురించి  తెలుసుకుందాం..!

నీళ్లు తాగాలి : వేసవిలో గంట గంటకూ నీళ్లు తా గుతుండాలి. పెద్దవాళ్లయితే రోజుకు సుమారు ఆరు లీటర్ల నీళ్లు తాగాలి. పిల్లలు రెండు లీటర్లకు పైగా తాగాలి.

డీహైడ్రేషన్ కాకుండా : వేసవిలో కూరగాయలు తినాలి.80శాతం నీళ్లు ఉండే పుచ్చకాయతో పాటు ద్రాక్ష, కర్బూజా లాంటి ఫ్రూట్స్ తినాలి. వేసవిలో జీర్ణశక్తి మందగిస్తుంది. కాబట్టి మసాలా, వేపుళ్లు, నాన్వెజ్ వంటి హెవీ ఫుడ్ తగ్గించాలి.

బయటకెళ్లాల్సి వస్తే : ఎండకు బయటకు వెళ్తే కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ముఖాన్ని తుండు లేదా స్కార్ప్​ తో కప్పుకోవాలి. పుదీనా రసాన్ని నీళ్లలో కలిపి, అందులో ఒక నిమ్మకాయ రసం పిండి తాగాలి.

కూల్ డ్రింక్స్ వద్దే వద్దు : కూల్డ్రింక్స్, ఎనర్జీ డ్రింకు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మరసాలను ఐస్ క్యూబ్స్ కలపకుం డా తాగాలి. కాఫీ, టీల్లోని కెఫిన్ వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.

సూప్స్ : దోసకాయతో చేసిన సూప్​ ను భోజనానికి ముందు తాగితే ఆకలి పెరుగుతుంది. మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శెనగలు లాంటి వాటిని తింటే మంచిది.. తాజాపండ్లు కలిపిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తినడం వల్ల కావాల్సిన ప్రొటీన్లు, క్యాల్షియం అందిస్తాయి.